అదనపు కట్నం ఇవ్వలేదని వధువుపై గ్యాంగ్ రేప్

Article

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. పెళ్లయిన తొలిరాత్రే నవ వధువు గ్యాంగ్ రేప్‌కు గురైంది. కొత్తగా వివాహం చేసుకున్న 26 ఏళ్ల మహిళ తన భర్త, అతని సోదరుడు, మార్చి 6 న ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ముజఫర్‌నగర్‌ శివారులోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ నవ వధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బులంద్‌షహర్‌లో జహంగీర్ బాగ్‌లో ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. మార్చి 6వ తేదీ ముజఫర్‌నగర్‌ శివారులోని ఓ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. అదే రోజు రాత్రి నవ వధువు(26)పై బావతో కలిసి ఆమె భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత గురువారం (మార్చి 14)న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. పెళ్లి రోజు కట్నం కోసం వరుడు, అతని కుటుంబ సభ్యులు గొడవ చేశారని తెలిపాడు.సోదరి పెళ్లి కోసం అప్పటికే తాను రూ.7లక్షలు ఖర్చు పెట్టుకున్నానని చెప్పాడు. పెళ్లి రోజు రాత్రి వరుడు, అతని బావ కలిసి మద్యం సేవించారని, అదే మత్తులో తన సోదరిపై అత్యాచారానికి తెగబడ్డారని వెల్లడించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఐపీసీ వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.

Prev బుట్టా రేణుక సంచలన నిర్ణయం..
Next భర్త, కుమారుడిని హత్యచేసిన మహిళ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.