గోరఖ్ పూర్ నుంచి సినీ నటుడు రవికిషన్ పోటీ

Article

టాలీవుడ్ లో కొంతకాలం కిందట వచ్చిన రేసుగుర్రం చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రవికిషన్ అనే భోజ్ పురి కథానాయకుడు విలన్ గా నటించి మెప్పించాడు. మద్దాలి శివారెడ్డి పాత్రతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన రవికిషన్ ఆపై అనేక చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఇప్పుడీ నటుడు రాజకీయాల్లో ప్రవేశించి ఎంపీగా పోటీచేస్తున్నాడు. రవికిషన్ కు బీజేపీ యూపీలోని గోరఖ్ పూర్ నియోజకవర్గం సీటును కేటాయించింది.

బీజేపీ అధినాయకత్వం సోమవారం ఏడుగురు యూపీ అభ్యర్థులను ప్రకటించగా అందులో రవికిషన్ పేరు కూడా ఉంది. ఈ భోజ్ పురి నటుడు పోటీచేస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గం కమలనాథులకు కంచుకోట అని చెప్పాలి. ప్రస్తుతం యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గతంలో ఇక్కడినుంచి ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.

Prev పారిస్ చర్చిలో అగ్నిప్రమాదం...కుప్పకూలిన వైనం
Next ఆంధ్ర రాజకీయాల్లో జనసేన మూడో ప్రత్యామ్నాయమేనా?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.