రేపు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తాం: చంద్ర‌బాబు

Article

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను రేపు కలవబోతున్నామని ఏపి సిఎం చంద్రబాబు తెలిపారు. అయితే తనను కలుసుకునేందుకు కేవలం 11 మందికి మాత్రమే కోవింద్ అనుమతి ఇచ్చారని వెల్లడించారు. అందువల్ల రేపు ఏపి భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీగా వెళతామని పేర్కొన్నారు. అక్కడి నుంచి 11 మంది సభ్యులు రాష్ట్రపతిని కలిసి ఏపికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యాన్నిఆయన దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరుగుతున్న ధర్మపోరాట దీక్ష ముగింపు సభలో చంద్రబాబు మాట్లాడారు.

విభజన చట్టంలో 18 హామీలతో పాటు ఏపీకి ప్రత్యేకహోదాను 5 సంవత్సరాల పాటు ఇస్తామని పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గత ఐదేళ్లుగా పోరాడుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. ‘మోడీ మనసు మారుతుంది.. ఏపికి న్యాయం జరుగుతుందనే అమరావతి శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించాం. ఆయన్ను గౌరవించాం. కానీ ఆయన ఏపి ప్రజల ముఖాన పార్లమెంటులో మట్టి, యమునా నీళ్లు కొట్టి ఢిల్లీకి వెళ్లిపోయారు’ అని దుయ్యబట్టారు.

Prev చంద్రబాబుతోనే కాదు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5.. చాలా చానెల్స్ తో యుద్ధం చేస్తున్నాం!: జగన్
Next ‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదు: కిషన్ రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.