ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Article

నల్గొండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Prev కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
Next ఇంటర్‌ బోర్డు ఎదుట రేవంత్‌, సంపత్‌ల ధర్నా, అరెస్టు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.