సబితపై కాంగ్రెస్‌ పార్టీ ఫైర్‌

Article

హైదరాబాద్‌: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలకు పదునుపెంచారు కాంగ్రెస్‌ నేతలు, ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా, ఎమ్మెల్యే సబితారెడ్డి పదవికి రాజీనామా చేయాలని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. భట్టి చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టారు. అనంతరం జిల్లెలగూడలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో దశాబ్దకాలం పాటు సబితా పదవులు అనుభవించారని, నియోజకవర్గం మారినా టికెట్‌ ఇచ్చి గెలిపించినా,..ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో చేరడం సిగ్గుచేటన్నారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తిగా సబితారెడ్డి మిగిలిపోతారన్నారు. రాజీనామా చేయకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. శాసనసభ సభ్యత్వం రద్దు చేసే విధంగా స్పీకర్‌పై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. సభాపతి స్పందించకుంటే..రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆమెపై 420, 405, 408 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక పార్టీ గుర్తుతో పోటీ చేసి, ఆ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు గౌరవప్రదమైన చట్టసభల్లో కూర్చునే అర్హత లేదని అన్నారు.

మహేశ్వరం ఎమ్మెల్యేగా ఎన్నికైన సబిత ఇంద్రారెడ్డిని నమ్మి గెలిపించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను మోసం చేసి పార్టీ ఫిరాయించారని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Prev ఏపి లాసెట్‌ ఫలితాలు విడుదల
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.