సమర్థులును, నీతిమంతులను ఎన్నుకోండి: నల్లమిల్లి శేషారెడ్డి

Article

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్థులు, నీతిమంతులను ఎన్నుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనకు కుల, మత బేధం లేదని, అన్ని కులాలవారితో కలిసిమెలసి ఉంటానని అన్నారు. ఎందుకంటే 30, 40 ఏళ్లుగా తాను పూర్తిగా విద్యా వ్యవ్థలో ఉన్నానని, అన్ని వర్గాల పిల్లలు తన విద్యాసంస్థల్లో చదవుతున్నారని అన్నారు. తనకు ఎస్సీ కమ్యూనిటీ అంటే చాలా ఇష్టమని, వాళ్లను అభివృద్దిలోకి తీసుకురావలనే కోరిక ఉందన్నారు. తన టీచింగ్ స్టాప్‌లో కూడా ఎక్కువ శాతం ఎస్సీ కమ్యూనిటీవాళ్లే ఉన్నారని, తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎస్టీ అభివృద్ధి కోసం చాలా కృషి చేశానని శేషారెడ్డి పేర్కొన్నారు.

తన కళాశాల వద్ద ఓ చర్చ్ కూడా కట్టించానని శేషారెడ్డి చెప్పారు. శాసనమండలి అంటే మేధావుల సభని, తాను ఎమ్మెల్సీగా రెండేళ్లు పనిచేశానని, ఈ రెండేళ్లలో వందసార్లు సభలో మాట్లాడానని చెప్పారు. ఎక్కువసార్లు మాట్లాడిన ఘనత తనకే దక్కిందర్నారు. అనేక బిల్లలు పాస్ కావడంలో తన పాత్ర ఉందని అన్నారు. కానీ ఎమ్మెల్యేగా ఐదేళ్లు పనిచేశానని, ఆ ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలో కనీసం పదిసార్లు కూడా తనకు మాట్లాడే అవకాశం రాలేదని అన్నారు. తనకు కొన్ని రాజకీయ పార్టీల నుంచి పిలుపు వచ్చిందని, సున్నితంగా తిరస్కరించారని చెప్పారు. ఏ పార్టీ నుంచి గెలిచినా, ఆ పార్టీకి అనుకూలంగా ఉండాల్సి వస్తుందని, అది తనకు ఇష్టం లేదని, అందుకే తనకున్న అనుభవంతో ఎమ్మెల్సీగా, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని శేషారెడ్డి స్పష్టం చేశారు.

Prev టీఆర్ఎస్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.