28 మంది ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారులను అరెస్ట్

Article

స్పెయిన్ : స్పెయిన్ లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మ్యాచ్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా 28 మంది ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారులను అరెస్ట్ చేశారు. వీరితోపాటు ఈ కేసులో మరో 55 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మేనియన్ క్రిమినల్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులు ఓ టెన్నిస్ క్రీడాకారుడి సహకారంతో మిగతా క్రీడాకారులను మ్యాచ్ ఫిక్సింగ్ లోకి లాగారు. సదరు క్రిమినల్ గ్యాంగ్ ఆటకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్ణయించిన ఫలితాలు వచ్చేలా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. మొత్తం 97 ఐటీఎఫ్, ఛాలెంజర్ మ్యాచుల్లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు యూరోపోల్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Prev 16 లక్షల విలువ చేసే గుట్కాలు టాస్క్ ఫోర్స్ పోలీసుల స్వాధీనం
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.