పేలుళ్లకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా

Article

శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. ఈస్టర్ సండే రోజున దేశంలో జరిగిన ఉగ్రదాడులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. పేలుళ్ల విషయంలో తన వైపు నుంచి ఎటువంటి వైఫల్యం లేదని అయితే, తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొన్ని సంస్థల వైఫల్యం కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.

ఉగ్రదాడులపై నిఘా వర్గాలు ముందుగా హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం దాడులను నిలువరించలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ చీఫ్, రక్షణ శాఖ కార్యదర్శిని రాజీనామా చేయాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశించారు. దీంతో హేమసిరి తన పదవికి రాజీనామా చేశారు. గత ఆదివారం శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Prev మోదీ మాటలను వ్యతిరేకిస్తున్న నెటిజెన్లు
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.