కలకలం సృష్టించిన రైల్వే ట్రాక్‌పై బాంబు

Article

కోల్‌కతా: పశ్చిమ్‌బంగాలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ రైల్వే ట్రాక్‌పై బాంబు కలకలం సృష్టించింది. స్థానిక అశోక్‌నగర్‌లోని రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువును గుర్తించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆ వస్తువును బాంబుగా గుర్తించారు. వెంటనే స్క్వాడ్‌ను పిలిపించి బాంబును నిర్వీర్యం చేసినట్లు తూర్పు రైల్వే సీపీఆర్‌వో నిఖిల్‌ కుమార్‌ తెలిపారు. ఘటనతో రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. బాంబును నిర్వీర్యం చేసిన తర్వాత ట్రాక్‌పై రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు నిఖిల్‌ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Prev 'గూగుల్' ఏఐ కళ్లను చూసి మీకొచ్చిన రోగమేంటో తెలిపేవిధంగా సరికొత్త ఆవిష్కరణ
Next జగన్ సర్కారుకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టదు: యనమల
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.