టీడీపీకి షాక్.. గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా

Article

కృష్ణా: ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని పులపర్తి ప్రకటించారు. కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి... వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుపై 13,505 మెజార్టీతో గెలుపొందారు.

కాగా.. ఈ ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ నేలపూడి స్టాలిన్‌బాబుకు ఇవ్వడంతో అసంతృప్తికి లోనైన ఆయన రాజీనామా చేసి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.

Prev ఎన్నికల పండగ వచ్చేసింది
Next జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.