తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Article

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ర్టాభివృద్ధి కోసమే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. తొర్రూర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్టాభివృద్ధిని కాంక్షించి ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ 16 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదాలు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Prev వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం...ముగ్గురు అక్కడికక్కడే మృతి
Next జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.