తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

Article

హైదరాబాద్‌ :తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేస్తామని ప్రకటించింది. అప్లై చేసుకోవడానికి ఇంటర్‌నెట్‌ కేంద్రాల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఫీజు చెల్లించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. ఇంటర్మీడియట్‌ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఇంటర్‌ ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్‌.. ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ 12 రోజుల్లోగా పూర్తి చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. మే 15 లోపు కొత్త ఫలితాలు, కొత్త మెమోలు ఇంటికి వస్తాయని పేర్కొంది. దీనికోసం సిబ్బంది నియామకం చేపట్టారు. గతంలో మూల్యాంకనం చేసిన అధ్యాపకులతోనే పునఃపరీశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధ్యాపకుల సెలవులను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Prev శ్రీలంకలో ఈరోజు మరో బాంబు పేలుడు
Next పశ్చిమ బెంగాల్‌లో రీ పోలింగ్‌ కు ఆదేశం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.