తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి

తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి

లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి 17వ పార్లమెంటుకు ఎన్నికైన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే తొలిసారి ఎంపీగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. మిగతా సభ్యుల్లా పేపర్లలో రాసిన ప్రతిజ్ఞ కాకుండా మొబైల్ ఫోన్‌లో చూసి తెలుగులో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం కోసం రేవంత్ లేచి వస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు బల్లలు చరుస్తూ ఆహ్వానించడం విశేషం.

ఇక కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పోతగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, కవిత మాలోత్‌, నామా నాగేశ్వరరావు తదితరులు కూడా తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేసే సమయంలో వారి వెనుకే కూర్చున్న హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి బల్ల చరిచి అభినందించారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా రెండో రోజు తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు.

more updates »