ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన

Article
దిల్లీ: దేశరాజధాని దిల్లీలో తెలంగాణ భవన్‌ ఎదుట తెలుగు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటర్‌బోర్డు వ్యవహారంపై దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు విద్యార్థులు నిరసన చేపట్టారు. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు తప్పిదాలపై న్యాయవిచారణ జరిపించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.మరోవైపు తెలంగాణ ఇంటర్‌ బోర్డు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి జగదీశ్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
Prev విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి: పవన్‌
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.