తెలుగుదేశం ఓటమికి కారణం జనసేన పార్టీనేనా?

Article

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణం ఒక విధంగా జనసేన పార్టీనే అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సాధించిన ఓట్లను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని 8 లోక్‌సభ, 31 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వారికి వచ్చిన మెజారిటీ కన్నా కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. బాపట్ల నియోజకవర్గంలో జనసేన మద్దతుతో బీఎస్పీ అభ్యర్థి రంగంలో నిలిచారు. ఇక్కడ వైకాపా అభ్యర్థికి 15881 ఓట్ల మెజారిటీ రాగా... బీఎస్పీ అభ్యర్థికి 41,816 ఓట్లు లభించడం గమనార్హం. జనసేన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు విశాఖ లోక్‌సభ అభ్యర్థి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ సాధించారు. ఆ తర్వాత అమలాపురం అభ్యర్థి డీఎంఆర్‌ శేఖర్‌, సినీ నటుడు నాగబాబులకు వచ్చాయి.

ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నాయడు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే బాగుండేదని మరియు ఎన్నికలు ముంచుకొస్తున చివరి రోజుల్లో చంద్రబాబు నాయడు అనవసరంగా మోడీ తో విభేదించి కాంగ్రెస్ తో కలవడం కూడా తెలుగు దేశం పార్టీ యొక్క ఘోర ఓటమికి కారణం అని టీడీపీ కార్యకర్తల్లో వినిపిస్తుంది.

Prev చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడా?
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.