సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా ప్రయాణికుల రద్దీ

Article

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల తో కిక్కిరిసిపోయింది. సొంత గ్రామాలకు వెళ్లే వారితో రైల్వేస్టేషన్ కోలాహలంగా మారింది.సికింద్రాబాద్‌ నుంచి హౌరా వైపు వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, కాగజ్‌నగర్‌ వైపు వెళ్లే భాగ్యనగర్‌, ఏపీ వైపు వెళ్లే సింహపురి, మచిలీపట్నం, గౌతమి, దురంతో, హౌరా, చార్మినార్‌, ఇంటర్‌ సిటీ రైళ్లలో ప్రయాణికుల రద్దీ చాలా ఉంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా రైళ్లను నడప కపోవడంతో రైల్వే స్టేషన్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.అట్టు నగరం లోని మహాత్మా గాంధీ బస్టాండ్ లో కూడా ప్రయాణికుల రద్ది భారీగా ఉంది.విజయవాడ, రాజమండ్రి వైపు వెళ్ళే బస్సులలో ప్రయాణికుల రద్ది ఎక్కువగా ఉంది.

Prev భారీగా పెరిగిన విదేశీ మారకం నిల్వలు
Next జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.