13 రాష్ట్రాల్లో రేపు రెండో విడత పోలింగ్‌

13 రాష్ట్రాల్లో రేపు రెండో విడత పోలింగ్‌
రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో రేపు (గురువారం) రెండో విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ రెండో విడతలో 97 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. దక్షిణాదిన తమిళనాడు, కర్నాటక లో మొత్తం 54 స్థానాలకు, ఉత్తరాదిన 11 రాష్ట్రాల్లో 43 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ సందర్భంగా ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
more updates »