ప్రియాంకగాంధీపై కేంద్ర మంత్రి ఉమాభారతి ఘాటు వ్యాఖ్యలు

ప్రియాంకగాంధీపై కేంద్ర మంత్రి ఉమాభారతి ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకగాంధీపై కేంద్ర మంత్రి ఉమాభారతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకను ఒక 'దొంగ భార్య' అంటూ వ్యాఖ్యానించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని... మన దేశంలో ఆమె ఒక దొంగ భార్యగా కనిపిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రియాంక ప్రభావం ఉండదని చెప్పారు. ప్రధాని మోదీపై వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేస్తుందనే వార్తలపై స్పందిస్తూ... ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. అమేథీలో ఓటమిని అంగీకరించే కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చత్తీస్ గఢ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉమాభారతి ఈ వ్యాఖ్యలు చేశారు.
more updates »