లక్ష్మీనారాయణ ట్వీట్ కు విజయసాయి రెడ్డి కౌంటర్

Article
జనసేన పార్టీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమిటో తనకు తెలిదని, లెక్కలు తికమకగా అనిపిస్తే చంద్రబాబు దగ్గరకు ట్యూషన్ కు వెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. వీరిద్దరి మధ్యా గత రెండు రోజులుగా పోటీ చేసిన సీట్లు, గెలిచే సీట్ల లెక్కలపై సామాజిక మాధ్యమాల్లో వాద ప్రతివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన విజయసాయి, "జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి" అని అన్నారు.
Prev చంద్రబాబునాయుడికి జగన్,మోదీ శుభాకాంక్షలు
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.