కేసీఆర్ చీప్ ట్రిక్ కు చెక్ చెప్పిన స్టాలిన్: విజయశాంతి

కేసీఆర్ చీప్ ట్రిక్ కు చెక్ చెప్పిన స్టాలిన్: విజయశాంతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ ను బుట్టలో వేసుకున్నట్టుగానే, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను బురిడీ కొట్టించాలని చూసిన కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలు తమిళనాడులో ఫలించలేదని, చీప్ ట్రిక్స్‌ కు స్టాలిన్ చెక్ పెట్టారని ఎద్దేవా చేస్తూ, తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ ను పెట్టారు.

"ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత మూడు నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఆడిన డ్రామాకు తెరపడింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలికిన గులాబీ బాస్.. ఇప్పుడు దిక్కు తోచని స్ధితిలో ఉన్నట్లు టీఆరెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చిన షాక్ తో టీఆరెస్ అధినేతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్లుంది.

మాయమాటలు చెప్పి, రాష్ట్ర విభజన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న విధంగానే, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలు కల్లలుగా మిగిలిపోయాయి. ఇన్నిరోజులు కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో..సారు, కారు, సర్కారు అంటూ మాట్లాడిన వారి నోట... డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్ వినిపిస్తోంది.

more updates »