వివేకా హత్యలో కొన్నిఆధారాలు సేకరించాం: ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ

Article

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యగా ప్రాథమికంగా నిర్థారించినట్టు కడప జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్టు స్పష్టంచేశారు. నుదిటిపై రెండు లోతైన గాయాలు, తల వెనుక భాగంలో మరో గాయం, ఛాతి, తొడ భాగంలోనూ గాయాలు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి తాము కొన్ని ఆధారాలు సేకరించినట్టు చెప్పారు. ఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రలు గుర్తించామని, అవి ఎవరివో తేల్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టంచేశారు. ఈ కేసు విచారించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

Prev అదనపు కట్నం ఇవ్వలేదని వధువుపై గ్యాంగ్ రేప్
Next భారీగా రైతుల నామినేషన్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.