వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి

Article

హైదరాబాద్‌: వైఎస్‌ కుటుంబాన్ని పూర్తిగా లేకుండా చేయాలనేది తెదేపా కుట్ర అని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనుక కుటుంబ కలహాలు ఏమీ లేవని చెప్పారు. నిన్న కూడా వివేకా ప్రచారంలో పాల్గొన్నారన్నారు. ఈ హత్య కేసు సూత్రదారులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ అని.. వారిద్దరి మద్దతుతోనే మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ హత్య చేయించారని విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు తాబేదారులుగా ఉన్నారని.. రాష్ట్రంలోని చాలా హత్య కేసుల్లో తెదేపా ప్రమేయముందన్నారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని చెప్పారు. సిట్‌ కూడా డీజీ నేతృత్వంలోనే పనిచేస్తుందని.. డీజీపైనా తమకు నమ్మకం లేదన్నారు. అందుకే వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈసీకి లేఖ రాస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.

Prev తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
Next జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.