సైకిల్ సవారీ చేసిన కలెక్టర్ హరిత

Article

వరంగల్ రూరల్: ఖానాపురం మండలంలోని పర్యాటక ప్రదేశమైన పాకాలలో శుక్రవారం నిర్వహించిన నేచర్‌ క్యాంపులో జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ హరిత వివిధ శాఖల అధికారులతో కలిసి పాకాల అడవుల్లో 2 గంటల పాటు కాలినడకన 5 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్, నేచర్‌వాక్ నిర్వహించారు. అనంతరం పాకాల కట్టపై కిలోమీటర్ మేర సైకిల్ తొక్కారు. తోటి అధికారులతో హెల్త్ ఈజ్ వెల్త్ అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పాకాల ఎకో టూరిజం అభివృద్ధికి ప్రజలు, పర్యాటకులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి, డీఎఫ్‌ఓ పురుషోత్తం, డీపీఆర్‌ఓ పల్లవి తదితరులు ఉన్నారు.

Prev భార్యపై కామెంట్లు చేసిన కుర్రాడిని చితకొట్టిన కలెక్టర్
Next బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.