భార్యపై కామెంట్లు చేసిన కుర్రాడిని చితకొట్టిన కలెక్టర్

Article

తన భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేసిన కుర్రాడిని పోలీస్ స్టేషన్‌లో చితక్కొట్టాడు ఓ కలెక్టర్. తాను ఓ జిల్లాకు అధికార ప్రతినిధిని అనే విషయం కూడా మరిచి, ఆవేశంతో యువకుడిని కాళ్లతో తన్నుతూ వేధించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలీపురుద్వార్ జిల్లా కలెక్టర్ నిఖిల్ నిర్మల్ భార్య నందిని కిషన్. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే కలెక్టర్ గారి భార్య నందిని కిషన్‌కు ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయ్యాదు వినోద్ కుమార్ సర్కార్ అనే యువకుడు. వీరి మధ్య అప్పుడప్పుడూ ఛాటింగ్ కూడా జరుగుతుండేది. అయితే జనవరి 5న నందిని కిషన్‌తో ఛాటింగ్ చేసిన వినోద్ కుమార్... కొంచెం చనువు తీసుకుని, అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టాడు. దాంతో బాగా హార్ట్ అయిన నందిని, భర్తకు విషయం చెప్పింది.

అంతే కలెక్టర్ హుటాహుటీన పోలీసులకు ‘అతన్ని పట్టుకురండి...’ అని ఆదేశాలు జారీ చేశారు. గంటల వ్యవధిలోనే వినోద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... ఫలకత్తా పోలీస్ స్టేషన్‌లో అతన్ని హాజరుపరిచారు. స్టేషన్‌కు వస్తూనే... ‘నా భార్యపై ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తావా... నీకెంత ధైర్యం... నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేయగలను’ అంటూ కాలుతో తన్నుతూ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన భార్య నందిని కూడా యువకుడిని కాలితో తన్ని... కొడుతూ తీవ్రంగా బెదిరించింది. ఈ వీడియో స్వయంగా పోస్ట్ చేసిన ఆమె... ‘నా భర్త నిజమైన హీరో. నాపై కామెంట్ చేసిన వ్యక్తిని చంపేస్తానని చెప్పాడు. నేను అతన్ని కొట్టాను... తన్నాను... ఇలాంటి భర్త దొరికినందుకు గర్విస్తున్నా...’ అంటూ పోస్ట్ చేసింది.

ఈ వీడియో వైరల్ కావడంతో మానవ హక్కుల సంఘాలు కలెక్టర్‌పై, అతని భార్యపై దాడిని తీవ్రంగా ఖండించాయి. ఇష్యూ పెద్దది కాకముందే ఇష్టారాజ్యంగా వ్యవహారించిన కలెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మమతా బెనర్జీ సర్కార్. యువకుడు మాత్రం తానే తప్పు చేయలేదని వాపోవడం విశేషం. ఆమెను ఓ గ్రూపులో యాడ్ చేసినందుకు, తనను తిట్టిందని... దానికి తాను కూడా అదే రీతిలో స్పందించానని చెప్పుకురావడం విశేషం.

Prev తీవ్ర మనస్ధాపంతో ఆలోక్‌ వర్మ రాజీనామా
Next బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.