కదిలే రైళ్లలోనూ ఖాళీ బెర్తుల వివరాలు తెలుసుకోవచ్చు

Article

హైదరాబాద్‌: రైలు కదిలే సమయానికి ఖరారైన రిజర్వేషన్‌ బెర్తుల పట్టిక మాత్రమే ఇప్పటివరకూ అందరికీ అందుబాటులో ఉండేది. ఇకపై రైలు కదిలాక కూడా ఖాళీ బెర్తుల వివరాలను తెలుసుకోవచ్చు. రైల్వే శాఖ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన హ్యాండ్‌ హెల్డ్‌ టర్మినల్స్‌ (హెచ్‌హెచ్‌టీ) వ్యవస్థతో ఇది సాధ్యమయింది. డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా మొదటిసారి ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వేలో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అమిత్‌ వరదాన్‌ గురువారం ప్రారంభించారు. హెచ్‌హెచ్‌టీ పరికరాల ద్వారా రైలు ప్రయాణంలో టికెట్ల తనిఖీని నిర్వహించనున్నారు. రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికుల వివరాలు దీంతో సులువుగా తనిఖీ చేయొచ్చు. వివిధ స్టేషన్ల మధ్య ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను తెలుసుకోవడంతోపాటు వాటిని కేటాయించడానికి మార్గం సుగమమయింది. ఈ విధానాన్ని 51 రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అనంతరం తొలిసారి సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని సిబ్బందికి 40 హెచ్‌హెచ్‌టీ పరికరాలను అందించారు.

Prev ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.