ఏపీ కొత్త ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ తయారైపోయింది

Article

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలొకెత్తు.. ఏపీ ఎన్నికలు ఒక ఎత్తు అన్న చందంగా ఉంది ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు, ఆతర్వాతి పరిస్థితులు చూస్తుంటే.. టీడీపీ, వైసీపీ, జనసేన, సందట్లో సడేమియాలా ప్రజాశాంతిపార్టీ పాల్ పోరాటం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రాన్ని యమరంజుగా మార్చేశాయి. ఎన్నికల ప్రచారం మొదలు, ఓటింగ్ వరకూ సాగిన క్రతువు దేశవ్యాప్తంగా అందరిదృష్టినీ ఆకర్షించింది.

అయితే, ఎన్నికల అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలు గెలుపుతమదేనన్న ధీమాతో ఉన్నారు. అటు సోషల్ మీడియాలోనూ వైసీపీ తమదే విజయమని విజయఢంకా ఇప్పడే మోగించేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక ఫలకాన్నే రెడీ చేసి నెట్టింట్లోకి వదిలింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన ఇతర పార్టీలన్నీ సైలెంట్ గా ఉంటే, వైసీపీ వర్గం మాత్రం ఫలితాలు రాకుండానే చాలా ఎక్కువ చేస్తుందంటూ మరోవైపు కామెంట్లు కూడా గట్టిగానే పడుతున్నాయి.

Prev ప్రాణ స్నేహితుడి ఉసురు తీసిన టిక్‌టాక్‌
Next మద్యం మత్తులో అధికారులు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.