వైఎస్ వివేకానంద రెడ్డి పోస్ట్‌మార్టం పూర్తి..

Article

వైఎస్ వివేకానంద మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు వైద్యులు... అనంతరం మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలిస్తున్నారు... ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. ఒక సాయంత్రం 5 గంటలోగా పులివెందుల చేరుకోనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. కాగా, ఇవాళ తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతిచెందారని చెబుతున్నా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో మృతిచెంది ఉండగా ఆయనను కుటుంబసభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే మరణించారు. ఇక ఆయన నుదుటి ప్రాంతంలో... తల వెనుకభాగంగాలో బలమైన గాయాలుండడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్‌మార్టం పూర్తైనా... నివేదిక రావాల్సి ఉంది.

Prev వివేకానందరెడ్డి మృతిపై స్పందించిన చంద్రబాబు
Next భారీగా రైతుల నామినేషన్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.