‘యాత్ర’ చిత్రాన్ని తిలకించిన విజయమ్మ దర్శక, నిర్మాతలపై ప్రశంసలు

Article
కోట్లాది మంది హృదయాల్లో ఉన్న వైఎస్ ఆర్ జ్ఞాపకాలను మళ్లీ ‘యాత్ర’ చిత్రంతో దర్శక నిర్మాతలు తట్టి లేపారన్నారు వైఎస్ సతీమణి విజయమ్మ. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’ మూవీ ఫిబ్రవరి 8న విడుదలైన విశేష ప్రజాధరణ పొందుతోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ పాత్రను పోషించగా.. బాహుబలి నటి అశ్రిత విజయమ్మ పాత్రలో ఒదిగిపోయి నటించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోన్న ఈ చిత్రాన్ని సోమవారం నాడు వైఎస్సార్ సతీమణి వై. ఎస్. విజయమ్మ తిలకించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. ‘రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను కీలకంగా చేసుకుని ‘యాత్ర’ అనే సినిమాను తెరకెక్కించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. కొన్ని కోట్లమంది గుండెల్లో ఉన్న వైఎస్‌ను, ఆయన వ్యక్తిత్వాన్ని, వ్యవహార శైలిని, ఆయన సంక్షేమ పథకాలను, ప్రజల కోసం ఆయన పడిన తపనను మరోసారి యాత్ర సినిమా ద్వారా తట్టిలేపారు. రాజశేఖర్ రెడ్డిగారిని 40 సంవత్సరాలు పాటు ఏవిధంగా అయితే ఆదరించారో.. ఆయన వెళ్లిపోయిన తరువాత ఆయన కుటుంబాన్ని కూడా అలాగే ఆదరించారు. ఇప్పుడు ఆయనపేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు విజయమ్మ.
Prev చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారు: అమిత్ షా
Next ‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదు: కిషన్ రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.