వైఎస్సార్‌సీపీ దెబ్బకు కుప్ప కూలిన కంచు కోటలు

Article

రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు సగం (49.95 శాతం) ఓట్లు ‘ఫ్యాన్‌’ ఖాతాలో పడ్డాయి. ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా, చీకటి ఒప్పందాలతో పోటీ చేసిన టీడీపీ 39.18 శాతం ఓట్లకు పరిమితమైంది. అంటే.. టీడీపీతో పోల్చితే 10.77 శాతం అధికంగా ఓట్లు సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 85 శాతానికిపైగా అంటే 151 శాసనసభ స్థానాలను.. 90 శాతానికిపైగా అంటే 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది.

వైఎస్సార్‌సీపీ దెబ్బకు టీడీపీ కంచు కోటలు కుప్పకూలాయి. కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని శాసనభ, ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మిగతా 9 జిల్లాల్లో సింహభాగం శాసనసభ, లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. వైఎస్‌ జగన్‌ ప్రభంజనంలో ముగ్గురు మినహా బాబు మంత్రివర్గంలోని సభ్యులందరూ ఓడిపోయారు. లోకేష్‌ మంగళగిరిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. బొబ్బిలి, విజయనగరం, కురపాం రాజ వంశీకుల కోటలు కొట్టుకుపోయాయి. కోట్ల, జేసీ వంటి రాజకీయ కుటుంబాలు వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు నిలబడలేకపోయాయి.

Prev గంటా మళ్ళీ జంప్ అవుతాడా !
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.