వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వారి పరిస్థితి!

Article
వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మృతి చెందగా 15 మందికి చంద్రబాబు సీట్లు ఇవ్వగా 14 మంది ఘోరంగా ఓటమిపాలయ్యారు, గెలిచింది ఒక్కరే.కేబినెట్‌లో ఉన్న నలుగురు మంత్రులు ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు, అమర్‌నాథ్‌రెడ్డిలు ఓడిపోయారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకట రమణ, పాడేరులో గిడ్డి ఈశ్వరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ, రంపచోడవరంలో వంతల రాజేశ్వరి, పామర్రులో ఉప్పులేటి కల్పన, విజయవాడ పశ్చిమలో జలీల్‌ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్, కందుకూరులో పోతుల రామారావు, గిద్దలూరులో అశోక్‌రెడ్డి, గూడూరులో సునీల్‌కుమార్, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డిలను అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఫిరాయింపుదారుల్లో ప్రకాశం జిల్లా అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్‌ ఒక్కరే గెలిచారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వీరి పట్ల ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఫలితాల్లో స్పష్టమైంది.
Prev చంద్రబాబుతో జతకట్టిన జాతీయ నాయకులకు కూడా శని పట్టిందా..!
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.