క్రికెట్ వరల్డ్‌ కప్‌కు ముందు తీవ్రంగా గాయపడ్డ కేదార్‌ జాదవ్‌

క్రికెట్ వరల్డ్‌ కప్‌కు ముందు తీవ్రంగా గాయపడ్డ కేదార్‌ జాదవ్‌
టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్ కేదార్‌జాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో క్రికెట్ ప్రపంచకప్‌ ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగే ఐసీసీ ప్రపంచకప్‌కి ఎంపికైన జట్టులో కేదార్‌ సభ్యుడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా పంజాబ్‌తో జరిగిన పోటీల్లో ఓ బౌండరీని ఆపే ప్రయత్నంలో కేదార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని వైద్య సహాయం కోసం తరలించారు. వైద్యులు ఎక్స్‌రే తీసి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గాయం మరీ పెద్దది కాదని, సరైన విశ్రాంతి తీసుకుంటే ప్రపంచ కప్‌ ముందు కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలియజేసినట్లు ఐపీఎల్‌ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపారు. ఒకవేళ కేదార్‌ ఆడే పరిస్థితి లేకపోతే స్టాండ్‌ బై సభ్యులుగా ఉన్న అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌ల్లో ఒకరికి అవకాశం వస్తుంది.
more updates »