చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్

Article
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లే ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా ఐపీఎల్ పన్నెండో సీజన్‌కు దూరమమవుతున్నట్లు చెప్పాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ విల్లే 2018లో చెన్నై తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. కుటుంబ కారణాల రీత్యా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు విల్లే చేసిన వ్యాఖ్యలను యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. డేవిడ్ భార్య కరోలిన్ మరికొన్ని రోజుల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. కీలక సమయంలో తన భార్య దగ్గరే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. సీఎస్‌కే యాజమాన్యం తన పరిస్థితిని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం ఉందని.. ఇది కొంచెం కఠినమైన నిర్ణయం అని విల్లే పేర్కొన్నాడు. విల్లే భారత్‌కు రాకుండా స్వదేశంలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి గాయం కార‌ణంగా లీగ్ నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.
Prev రాజస్థాన్‌పై హైదరాబాద్ అద్భుత విజయం
Next అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ఇవ్వనున్న యువరాజ్‌సింగ్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.