గౌతమ్ గంభీర్ క్రికెట్‌కు బై బై

గౌతమ్ గంభీర్ క్రికెట్‌కు బై బై
క్రికెట్‌ నుంచి తప్పుకొంటున్నా ఆంధ్రతో రంజీ మ్యాచ్‌ చివరిది గౌతం గంభీర్‌ వెల్లడి భారత జట్టు తరఫున విజయవంతమైన ఓపెనర్లలో ఒకడిగా.. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాడిగా ఘనమైన రికార్డు కలిగిన గౌతం గంభీర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు బై బై చెప్పాడు. దూకుడైన ఆటతీరుతో విరుచుకుపడే గౌతీ 2008 నుంచి 2011 వరకు టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. 2009లో టెస్టుల్లో నెంబర్‌ వన్‌గా నిలవడంతో పాటు ఐసీసీ ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌ అవార్డు దక్కింది. ఇక ఈనెల 6 నుంచి ఆంధ్రతో జరిగే రంజీ మ్యాచ్‌ అతడి రెండు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్‌లో చివరిది కానుంది.
more updates »