రాజస్థాన్‌పై హైదరాబాద్ అద్భుత విజయం

Article
హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రై జర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. శుక్రవారం స్థానిక ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాయల్స్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. వార్నర్(37 బంతుల్లో 69, 9ఫోర్లు, 2సిక్స్‌లు), బెయిర్‌స్టో(28 బంతుల్లో 45, 6ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలకమయ్యారు. గోపాల్(3/27) కు మూడు వికెట్లు దక్కాయి. తొలుత సంజూ శాంసన్(55 బంతుల్లో 102 నాటౌట్, 10ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా, రహానే(49 బంతుల్లో 70, 4ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించాడు. రషీద్‌ఖాన్(1/24), నదీమ్ (1/36) ఒక్కో వికెట్ తీశారు. రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Prev గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్‌ చేస్తున్నా బుమ్రా
Next అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ఇవ్వనున్న యువరాజ్‌సింగ్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.