ఐపీఎల్లో బెంగళూరు తీరుపై విజయ్ మాల్యా స్పందన

ఐపీఎల్లో బెంగళూరు తీరుపై విజయ్ మాల్యా స్పందన

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్లు ఎంతమంది ఉన్నా ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తీరే వేరు. ఓటములను అలవాటుగా మార్చుకున్న ఆ జట్టుపై వస్తున్న విమర్శలకు లెక్కేలేదు. ఈసారి కూడా ఐపీఎల్ లో దారుణమైన ప్రదర్శన కనబర్చిన బెంగళూరు టీమ్ పాయింట్ల పట్టికలో చిట్టచివరిస్థానంతో సరిపెట్టుకుంది. దీనిపై బెంగళూరు ఫ్రాంచైజీ మాజీ యజమాని విజయ్ మాల్యా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఎప్పుడు చూసినా బెంగళూరు టీమ్ లో మంచి ఆటగాళ్లు ఉంటారని, కానీ ఆ బలం అంతా కాగితాలపైనే అని మరోసారి రుజువైందని ట్వీట్ చేశారు. పరమచెత్త ఆటతీరుతో మొత్తం నాశనం అయిపోయిందంటూ వాపోయారు. అంతకుముందు, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వచ్చే ఏడాది మరింత పట్టుదలతో బరిలో దిగుతామని పోస్టు పెట్టాడు. దానికి స్పందనగానే విజయ్ మాల్యా ట్వీట్ చేశారు.

more updates »