రాయుడు ఏం త‌ప్పు చేశాడు.. అత‌న్ని ఎందుకు త‌ప్పించారు?

రాయుడు ఏం త‌ప్పు చేశాడు.. అత‌న్ని ఎందుకు త‌ప్పించారు?

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. వరల్డ్‌కప్‌కు టీమ్‌ను ఇలాగేనా సిద్ధం చేసేది అని ప్రశ్నించాడు. నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేయడంలో విఫలమవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఫెయిలవగానే అంబటి రాయుడిని పక్కన పెట్టడం సరి కాదని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్‌లో కుదురుకున్న ఓ బ్యాటింగ్ లైనప్ ఉండాలంటే నాలుగో స్థానంలో రావాల్సిన బ్యాట్స్‌మన్‌ను ముందుగానే నిర్ణయించాలి. అతనికి పూర్తిగా మద్దతుగా నిలవాలి అని గంభీర్ అన్నాడు. ధోనీ, ధావన్‌లను ప్రోత్సహించినట్లే రాయుడికి కూడా మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాల్సిందని గౌతీ అభిప్రాయపడ్డాడు. మీరు ఇతరులను ప్రోత్సహించారు.

గతేడాది ఫామ్‌లో లేకపోయినా ధోనీ, ధావన్‌ల వెంట నిలిచారు. వన్డేల్లో రాయుడు 50కిపైగా సగటు సాధించాడు. అతడు ఏ తప్పూ చేయలేదు. వైఫల్యాలు సహజమే. రెండు, మూడు వైఫల్యాల తర్వాత వేరే ప్లేయర్స్‌ను మీరు తప్పించలేదు కదా అని గంభీర్ ప్రశ్నించాడు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఎక్కువ ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదని అతను అన్నాడు. నంబర్ 4 స్థానం ఇప్పటికే సెటిల్ అయి ఉండాల్సింది. కోహ్లి 2011 వరల్డ్‌కప్‌లో నాలుగో స్థానంలోనే ఆడాడు. ఈ స్థానంలో ఎవరిని పంపాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినా వాళ్లకే కట్టుబడాలి. కాస్త ఓపిగ్గా ఉండాలి. నంబర్ 4ను పదే పదే మార్చకూడదు. ఎందుకంటే మిడిలార్డర్‌లో నంబర్ 3, నంబర్ 4 స్థానాలే చాలా ముఖ్యం అని గంభీర్ స్పష్టం చేశాడు.

more updates »