విరాట్ కోహ్లీ రాణిస్తే.. ప్రపంచకప్‌ ఇండియాదే: రికీ పాంటింగ్

విరాట్ కోహ్లీ రాణిస్తే..  ప్రపంచకప్‌ ఇండియాదే: రికీ పాంటింగ్

ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచకప్ ఈ ఏడాది మే 30 నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రోఫీని ముద్దాడేందుకు క్రికెట్ జట్లు కూడా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20, వన్డే సిరీస్‌లలో ఓటమిని రుచి చూసిన టీం ఇండియా తప్పులను సరిదిద్దుకొని.. ప్రపంచకప్ బరిలోకి దిగాలని భావిస్తోంది. అంతేకాక, భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హాట్ ఫేవరెట్‌గా ప్రపంచకప్ బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విరాట్ కోహ్లీ రాణిస్తే.. భారత్ కచ్చితంగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటుందని ఆయన అన్నారు. ''నాకు విరాట్ కోహ్లీకి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అతనికి నాలానే యాటిట్యూట్ ఉంది. అతను మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. అతను బ్యాటింగ్‌లో కాకుండా..

ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతన్ని చూస్తుంటే నాలాగే అనిపిస్తుంది. విరాట్ ఎన్నో అరుదైన వన్డే రికార్డులు సాధించాడు. అతను టీం ఇ:డియాకు ఒక మూలస్తంభం. అతను ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో రాణిస్తే.. కచ్చితంగా కప్ ఇండియాకే వస్తుంది'' అని పాంటింగ్ పేర్కొన్నారు.

more updates »