యువరాజ్ సింగ్‌ తన ధరని అనూహ్యంగా రూ. కోటికి తగ్గింపు : IPL 2019

Article

భారత వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్‌ కెరీర్‌ ఇప్పుడు సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డులు సృష్టించిన యువరాజ్ సింగ్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతాడా..? లేదా..? అనే అనుమానాలు నెలకొన్నాయి.

జైపూర్ వేదికగా ఈనెల 18న ఐపీఎల్ 2019 సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం జరగనుండగా.. యువరాజ్ సింగ్‌ తన ధరని అనూహ్యంగా రూ. కోటికి తగ్గించుకున్నాడు. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 70 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.

భారత్ జట్టుకి గత ఏడాదన్నరకాలంగా దూరంగా ఉంటున్న యువరాజ్ సింగ్.. ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడి ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఈ వెటరన్ ఆల్‌రౌండర్ చేసిన పరుగులు 65 మాత్రమే. దీంతో.. ఓ ఆరు మ్యాచ్‌ల్లో కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు.

అతని పేలవ ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేసిన పంజాబ్ ఫ్రాంఛైజీ.. ఈ ఏడాది అట్టిపెట్టుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది. గత ఏడాది కనీస ధర రూ. 2 కోట్లతో యువరాజ్ సింగ్ వేలంలోకి రాగా.. అదే ధరకి పంజాబ్ కొనుగోలు చేసింది. కానీ.. ఈ ఏడాది రూ.కోటితోనే రానున్నాడు. అయినప్పటికీ.. ఈ 36ఏళ్ల ఆల్‌రౌండర్‌ని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయడంపై అనుమానాలు లేకపోలేదు..! 2015 ఐపీఎల్ వేలంలో యువరాజ్ సింగ్‌ని రూ.16 కోట్లకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Prev చిక్కుల్లో పడ్డ భారత్‌
Next అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ఇవ్వనున్న యువరాజ్‌సింగ్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.