ఏపీ సెక్రటేరియట్ లో దొంగతనం...మంత్రి ఫోన్ స్వాహా

ఏపీ సెక్రటేరియట్ లో దొంగతనం...మంత్రి ఫోన్ స్వాహా

ఏపీ సెక్రటేరియట్ లో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సెల్ ఫోన్ ని అపహరించారు కొందరు కేటుగాళ్లు. అధికారులతో రివ్యూ మీటింగుకి వెళ్తూ.. తన ఫోన్ ని రూములోనే ఉంచి వెళ్లారు. మీటింగు ముగించుకుని భోజనం చేయటానికి కాంటీన్ కి వెళ్ళి.. ఆ తరువాత రూముకి వచ్చి చూస్తే ఇంకేముంది....ఫోన్ లేదు. మొత్తం వెతికిన ఎక్కడ కనిపించలేదు.

వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి వెతికించిన..లాభం లేకుండా పోయింది. అధికారుల సాయంతో ఫోన్ ని ట్రాక్ చేయిస్తే...అప్పటికే రాష్ట్రం దాటి...నల్గొండ జిల్లాలో ఉన్న మునుగోడులో ప్రత్యేక్షం అయ్యింది. సెక్రటేరియట్ లో ఒక మంత్రి ఫోన్ కే రక్షణ లేకపోతే ఇంకా మాములు జనల పరిస్థితి ఏంటని జనాలు దెప్పిపొడుస్తున్నారు.

more updates »