బాలయ్య సరసన శ్రియ, నయనతార

బాలయ్య సరసన శ్రియ, నయనతార

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లలో మరోమూరి తెరక్కెక్కనుంది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఈనెల 15నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. బాలకృష్ణ ఈ మూవీలో డబుల్ రోల్ చేస్తున్నారు. మూవీలో బాలయ్యలో అఘోర పాత్రలో నటించనున్నారనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందుకే బాలయ్య గుండుతో కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ శ్రియను తీసుకున్నారని తాజాగా మరో హీరోయిన్ గా నయనతార నటించనుందని సమాచారం.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్లలో వచ్చిన సింహా, లెజెండ్ మూవీలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. మళ్లీ ఈ కాంబినేషన్లలో మూవీ వస్తుండటంతో నందమూరి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అలాగే నందమూరి-నయనతార కాంబినేషన్లలో వచ్చిన ‘శ్రీరామ రాజ్యం’, ‘సింహా’ మూవీలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టాయి. అలాగే శ్రియ బాలయ్యతో ‘చెన్నకేవశరెడ్డి’, ‘శాతకర్ణి’ మూవీలో నటించి మెప్పించింది. బాలయ్య ఈ మూవీలో శ్రియ, నయనతారలతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ కీలక పాత్రలో నయనతార నటించనుందని తెలుస్తోంది.

ఈ మూవీని బోయపాటి పూర్తి యాక్షన్ ఎంటటైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి-నయనతార-శ్రియ-బోయపాటి కాంబినేషన్లో త్వరలోనే మూవీ పట్టాలెక్కనుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

more updates »