ఫస్ట్ డెత్.. కరోనా సోకి చనిపోయిన భారతీయుడు

ఫస్ట్ డెత్.. కరోనా సోకి చనిపోయిన భారతీయుడు

కరోనా వైరస్ సోకి త్రిపురకి చెందిన భారత యువకుడు చనిపోయాడు. ఈ ఘటన మలేసియాలో జరిగింది. భారతదేశానికి చెందిన వ్యక్తి కరోనా సోకి చనిపోవడం ఇదే తొలిసారి.

వివరాల్లో కి వెళ్తే.. త్రిపురకి చెందిన యువకుడు మనీరు హుస్సేన్ ఇటీవల మలేసియా వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు. కరోనా వైరస్ టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే మనీరు ని ప్రత్యేకంగా ఉంచి వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

more updates »