దేశంలోనే తొలిసారి.. దిశా చట్టంలో తొలి అడుగు

దేశంలోనే తొలిసారి.. దిశా చట్టంలో తొలి అడుగు

రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను సీఎం జగన్ ప్రారంభించారు. 24*7 ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిశ చట్టానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాప్‌ను కూడా జగన్ ప్రారంభం కావడం విశేషం. దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసుల విషయంలో 14 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21 రోజుల్లోపే శిక్ష ఖరారయ్యేటట్టుగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు సీఎం జగన్ తెలిపారు.

మహిళల రక్షణే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని.. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు.

more updates »