‘ఎఫ్-3’ మూవీకి మహేష్ గ్రీన్ సిగ్నల్?

‘ఎఫ్-3’ మూవీకి మహేష్ గ్రీన్ సిగ్నల్?

గతేడాది విడుదల ఎఫ్-2మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్-వరుణ్ సందేశ్ ఎఫ్-2లో నటించి మెప్పించారు. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ సందేశ్ కు జోడిగా మెహరీన్ నటించారు. అనిల్ రావుపూడి ‘ఎఫ్-2’ను ఫ్యామిలీ ఎంటటైనర్ గా తీర్చదిద్దారు. ఈ మూవీలోని కామెడీ సీన్లకు ఫ్యామిలీ ఆడియన్స్ కలెక్షన్ల వర్షం కురిపించారు. ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లలో తీసుకురావడంతో అనిల్ రావుపూడి సక్సస్ అవడంతో సినిమా భారీ విజయం సాధించింది. తాజాగా ‘ఎఫ్-3’ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.

‘ఎఫ్-2’ సక్సస్ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా ‘ఎఫ్-3’ చేయనున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ మూవీ సీక్వెల్లో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తారనే ప్రచారం జరిగింది. అనిల్ రావుపూడి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సరిలేరునికెవ్వరు’ మూవీని తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సరిలేరునికెవ్వరు’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లాడు. ఆయన విదేశాల నుంచి వచ్చాక మహేష్ బాబు తదుపరి మూవీ ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.

‘సరిలేరునికెవ్వరు’ మూవీ సక్సస్ తర్వాత మహేష్ బాబు, అనిల్ రావుపూడి మధ్య సన్నిహిత్యం బాగా పెరిగింది. దీంతో అనిల్ రావుపూడి ‘ఎఫ్-3’లో నటించాలని మహేష్ బాబును కోరగా అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి మూవీకి కమిట్ అయ్యాడు. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ అనంతరం ‘ఎఫ్-3’ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘సరిలేరునికెవ్వరు’లో మహేష్ కామెడీ చేయించిన అనిల్ రావుపూడి ‘ఎఫ్-3’ మూవీతో ఈ కాంబినేషన్ ను కొనసాగించాలని చూస్తున్నాడు.

more updates »