మహేష్ డబుల్ ధమకా.. ఫాన్స్ కి పండగే

మహేష్ డబుల్ ధమకా.. ఫాన్స్ కి పండగే

2020 ప్రారంభంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరునికెవ్వరు’ మూవీతో ప్రేక్షకుల ముందువచ్చారు. ఈ మూవీ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. నూతన సంవత్సర కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సరిలేరునికెవ్వరు’ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెల్సిందే. ఈ మూవీ విజయాన్ని ఆస్వాదిస్తూ మహేష్ బాబు ఇటీవలే ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళ్లాడు. ఆయన టూర్ నుంచి రాగానే దర్శకుడు వంశీ పైడిపల్లి తీసే మూవీలో నటించనున్నాడు. కాగా ఈ మూవీలో మహేష్ డబుల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి-మహేష్ బాబు కాంబినేషన్లలో వచ్చిన ‘మహర్షి’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సమయంలోనే మహేష్ బాబు మరోసారి వంశీ దర్శకత్వంలో నటిస్తానని చెప్పాడు. ఈమేరకు కథను సిద్ధం చేయాలని వంశీకి సూచించారు. దీంతో వంశీ పైడిపల్లి మహేష్ బాబు కోసం రజనీకాంత్ మూవీ ‘భాషా’ తరహా వంటి కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ డబుల్ రోల్ చేస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మహేష్ బాబుకు జోడిగా బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ ఎంపికైనట్లు తెలుస్తోంది. కియారా అడ్వాణీ ‘భరత్ అనే నేను’ మూవీలో ఇప్పటికే మహేష్ నటించింది. ఈ జోడికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో కియారాను తీసుకుంటే బాగుంటుందని మహేష్ భార్య నమత్రా శిరోధ్కార్ వంశీ పైడిపల్లికి సూచించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కియారాను సంప్రదించిన డేట్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. 2020 జనవరిలోనే ‘సరిలేరునికెవ్వరు’తో భారీ సక్సస్ అందుకున్న మహేష్ ఇదే సంవత్సరంలో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నారు. 2020 మహేష్ అభిమానులకు ‘డబుల్ ధమాకా’ ఖాయంగా కన్పిస్తుంది.

more updates »