‘కింగ్’ ను భయపెడుతున్న కరోనా వైరస్

‘కింగ్’ ను భయపెడుతున్న కరోనా వైరస్

కరోనా వైరస్ ఎఫెక్ట్ ‘కింగ్’ నాగార్జునను భయపెడుతుంది. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగ్ పై పడుతోంది. కరోనా వైరస్ భయంతో కింగ్ నాగార్జున తన తాజా చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు.

Read More: మహేష్ బాబు లాంచ్ చెయ్యడం వల్లే.. ఇలా జరిగింది

యదార్థ సంఘటన ఆధారంగా కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయవర్మ పాత్రలో నటిస్తున్నాడు. ప్రధాన పాత్రల్లో దియా మీర్జా, సయామీ ఖేర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో పూర్తి చేసుకొంది. ఈ సినిమాలో కొన్ని సవేశాలను థాయ్ లాండ్ లోకేషన్లలో చిత్రీకరించేందుకు ఇప్పటికే దర్శక, నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని థాయిలాండ్ లో చేయాలనుకున్న సీన్లను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More: ‘ఆర్ఆర్ఆర్’ డేట్స్ కు ‘కేజీఎఫ్-2’ విడుదల

ఈ మూవీకి వైల్డ్ డాగ్ అనే టైటిల్ ఖారారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. నాగార్జున ఎన్ఐఏ అధికారిగా నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. థాయిలాండ్ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిగా మిగతా లోకేషన్లలో జరిగే షూటింగ్ యథావిధిగా కొనసాగుతుంది.

more updates »