పింక్ సినిమాతో మళ్ళీ చిగురించిన పవన్-అలీ స్నేహబంధం

 పింక్ సినిమాతో మళ్ళీ  చిగురించిన పవన్-అలీ స్నేహబంధం

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కి ప్రముఖ కమెడియన్ అలీకి మధ్య విబేధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. పవన్ కళ్యాణ్, అలీ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికి వరకు వచ్చిన దాదాపుగా పవన్ నటించిన అన్ని సినిమాల్లో అలీ ఉన్నాడు. తొలిప్రేమతో మొదలైన వీరి సినీ ప్రయాణం ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. అలీ అంటే తనకు ఇష్టమని పవన్ పలు వేదికలపైన చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఇద్దరి మధ్య విభేదాలు, మనస్పర్థలు వచ్చాయి. ఇక ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. అయితే పవన్ సినిమాలలో అలీ కచ్చితంగా ఉంటాడు కాబట్టి పవన్ రీఎంట్రీగా వస్తున్న పింక్ రీమేక్ లో అలీ నటించనున్నాడని, పవన్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అలీని కోరారని వార్తలు వచ్చాయి.

more updates »