తెలంగాణలోని ఐపీఎస్‌లకు పదోన్నతులు

తెలంగాణలోని ఐపీఎస్‌లకు పదోన్నతులు

తెలంగాణలోని పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి కలిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది.

డీఐజీలగా ఉన్న రాజేష్‌ కుమార్‌, శివకుమార్‌ రెడ్డి, రవీందర్‌లకు ఐజీలుగా.డీఐజీలుగా ఉన్న కార్తికేయన్‌, రమేష్‌ నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావులకు ఐజీలుగా పదోన్నతి లభించింది.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ బదిలీలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగగా,ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 50మంది ఐఏఎస్‌లోను ఆకస్మికంగా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.


ఈ నేపథ్యంలో తర్వాతి రోజే ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని అందరూ భావించారు.కాగా సోషల్‌ మీడియాలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీ అని పోస్టింగ్‌లు పెట్టేసారు.ఆ సంచలనం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారుమోగిపోయాయి.


2018లోనే జరగాల్సిన ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు తెలంగాణ రాష్ట్ర ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి.


జిల్లాల్లో పనిచేస్తోన్న దాదాపు 12 మంది ఐపీఎస్‌ అధికారులను నగరానికి తీసుకురావాలన్న యోచనలో డీజీపీ ఉన్నట్లు సమాచారం.వారికి గ్రేటర్‌ పరిధిలోని మూడు కమిషనరేట్లలో, ఇతర రాష్ట్రస్థాయి విభాగాల్లో పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.''రైట్‌ పర్సన్‌ ఎట్‌ రైట్‌ పొజిషన్‌'' అన్న విధానంలో పోస్టింగ్‌లు ఉంటాయన్నది సత్యం.

more updates »