చిరంజీవి-152లో చరణ్ పాత్ర లీక్?

చిరంజీవి-152లో చరణ్ పాత్ర లీక్?

కొరటాల శివ డైరెక్టర్లో చిరంజీవి-152 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై అటూ మెగాస్టార్ కానీ, ఇటూ చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ మూవీ రాంచరణ్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. రాంచరణ్ పాత్రకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి-152మూవీలో రాంచరణ్ సిద్ధూ అనే క్యారెక్టర్లో నటించబోతున్నారని, ఈ మూవీలో 30నుంచి 40నిమిషాలు కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ-150 బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో అదే ఊపులో చిరంజీవి స్వాతంత్ర్య ఉద్యమకారుడు ఉయ్యాల నర్సింహారెడ్డి జీవితాధారంగా నిర్మించిన ‘సైరా’ మూవీలో నటించారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా ‘సైరా’ తెలుగులో ఘన విజయం సాధించినప్పటికీ అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే ఇందులో ‘సైరా’ పాత్రలో చిరంజీవి నటకు ప్రేక్షకులు మాత్రం ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత కమర్షియల్ డైరెక్ట్ కొరటాల శివతో చిరంజీవి మూవీ సెట్ అయింది. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చేసిన అన్ని సినిమాలకు నిర్మాతగా ఆయన తనయుడు రాంచరణే ఉన్నారు. కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో రాంచరణ్ ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. 150కోట్ల మేర భారీ బడ్జెట్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చిన స్టాలీన్ చిత్రం ఘన విజయం సాధించింది. స్టాలీన్ తర్వాత చిరంజీవి కలిసి నటించడం త్రిషకు ఇది రెండోసారి. ఈ మూవీలో చిరంజీవి ద్విప్రాతాభినయం చేస్తున్నారు. డైనమిక్ ఎండోమ్మెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే చిత్రం శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే చిరంజీవి-రెజీనాలపై ఐటమ్ సాంగ్ పూర్తి చేసుకొంది. ఈ మూవీలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు. ఏదిఏమైనా చిరంజీవి మూవీలో మెగాపవర్ స్టార్ ఎంట్రీ ఖాయం అవడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

more updates »