‘ఆర్ఆర్ఆర్’ డేట్స్ కు ‘కేజీఎఫ్-2’ విడుదల

‘ఆర్ఆర్ఆర్’ డేట్స్ కు ‘కేజీఎఫ్-2’ విడుదల

దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ రిలీజ్ డేట్స్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డాయి. ఆర్ఆర్ఆర్ మూవీ తొలుత జూలై 30న విడుదలవుందని ప్రచారం జరిగింది. సినిమా పొస్టు ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో ఈ మూవీని 2021 సంక్రాంతికి విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 2021 జనవరి 8న విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఆర్ఆర్ఆర్ ప్రకటించిన తొలి రిలీజ్ డేట్ కు ‘కేజీఎఫ్-2’ రానున్నట్లు తెలుస్తోంది.

యశో హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రం విడుదలైన అన్ని ఇండస్ట్రీల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు. ‘కేజీఎఫ్-2‘ పేరుతో అన్ని భాషల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఈ మూవీని తొలుత అక్టోబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. తొలుత ‘ఆర్ఆర్ఆర్’ మూవీ జూలై 30న వస్తుందని అనుకున్నారు.. అయితే ఈ మూవీ జనవరి 8కి వాయిదా పడింది.

ఈ డేట్ పై ‘కేజీఎఫ్-2’ కన్నేసింది. కేజీఎఫ్ మూవీ భారీ సక్సస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ‘కేజీఎఫ్-2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూలై 30తేది ఇప్పటికే ప్రేక్షకులకు కనెక్ట్ అవడంతో ఈ తేదినే ‘కేజీఎఫ్-2’ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు మొదలుపెట్టింది. అయితే యశ్ లాగే మరికొంత మంది హీరోలు కూడా ఈ డేట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది.

more updates »