అల్లు అర్జున్ పై షకీలా హాట్ కామెంట్

అల్లు అర్జున్ పై షకీలా హాట్ కామెంట్

టీనేజ్ కుర్రాళ్ల నుంచి పండు ముసలి వరకు షకీలా అంటే తెలియని వారుండమో.. ఒకప్పుడు శృంగార తారగా వెలుగొందిన షకీలా ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. యువతలో మాత్రం ఆమెకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది. షకీలా ఎప్పుడు హాట్ హాట్ అందాలతో వార్తల్లోకెక్కేది. అయితే ఈసారి మాత్రం తనకు హీరో అల్లు అర్జున్ ఎవరో తెలియనిదని చెప్పడంతో వార్తల్లో నిలిచింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ షకీలా కామెంట్ కి షాక్ అవుతున్నారు.

అల్లు అర్జున్ కు తెలుగుతోపాటు కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ డాన్స్ కు వారసుడిగా ముందుగా విన్పించే పేరు అల్లు అర్జున్. బన్నీ డాన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక షకీలా మళయాళ సినిమాల్లో శృంగార తారగా నటించి మెప్పించింది. తన హాట్ హట్ అందాలతో యువతను థియేటర్లకు క్యూ కట్టేలా మెస్మరైజ్ చేసింది. అయితే మళయాళంలోనూ బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉంది. స్టైలిష్ స్టార్ గా వెలుగొందుతున్న అల్లు అర్జున్ తనకు తెలియదని షకీలా అనడం ఆయన అభిమాలను షాక్ గురిచేసింది. ఇటీవలే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ మూవీతో సంక్రాంతికి భారీ సక్సస్ అందుకున్నాడు.

అల్లు అర్జున్ న్ని మళయాళ ఇండస్ట్రీలో మల్లు అర్జున్ అని కూడా పిలుస్తుంటారు. అలాంటిది ఆమెకు బన్నీ తెలియకపోవడం ఏంటని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నిజం ఆమెకు అల్లు అర్జున్ తెలియకపోవడం వల్లనే అలా అని ఉంటుందని షకీలా అభిమానులు ఆమెను సమర్థిస్తున్నారు. సినిమాల్లో నటించే వాళ్లకు చిన్న హీరోల గురించి తెలియదంటే ఒప్పుకుంటారోమోగానీ.. క్రేజీ హీరోల గురించి తెలియదు అంటే మాత్రం నమ్మశక్యంగా అనిపించడం లేదని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా చాలా రోజుల తర్వాత షకీలా వార్తల్లో నిలవడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

more updates »